15 బంతులు ఆడమన్నాడు
ముంబై: రోహిత్ శర్మ ఇచ్చిన సలహావల్లే గుజరాత్ టైటాన్స్‌పై తాను సెంచరీ చేయగలిగానని తిలక్ వర్మ వెల్లడించాడు. ఈసారి ఐపీఎల్‌లో స్థాయికి తగ్గ రీతిలో ఆడలేకపోయిన తిలక్..అహ్మదాబాద్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో అజేయ శతకం (45 బంతుల్లో 101)తో చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణమేమిటో తిలక్ వివరిస్తూ ‘రోహిత్ భాయ్‌తో ప్రత్యేకంగా మాట్లాడా. మ్యాచ్ పరిస్థితులతో సంబంధం లేకుండా తొలి 15-20 బంతులు ఆడు. నీ సత్తా ఏమిటో నీకు తెలుస్తుందన్నాడు’ అని చెప్పుకొచ్చాడు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0