బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

Apr 23, 2026 - 11:53
 0  3
బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

కావలసిన పదార్థాలు: బాదం పప్పులు - 20, మైదా - రెండు కప్పులు, రవ్వ - రెండు స్పూన్లు, పసుపు - అర స్పూను, ఉప్పు- అర స్పూను, నెయ్యి - మూడు స్పూన్లు, చక్కెర - రెండు కప్పులు, యాలకుల పొడి - అర స్పూను, కుంకుమ పువ్వు - కొన్ని రేకులు, నీళ్లు, నూనె - తగినంత.

తయారుచేసే విధానం: బాదం పప్పును వేడి నీళ్లలో పది నిమిషాలు నానబెట్టాలి. ఆ తరవాత పొట్టు తీసి కాస్త నీళ్లు కలిపి మిక్సీలో వేసి ముద్దలా చేసుకోవాలి. ఓ గిన్నెలో మైదా, రవ్వ, పసుపు, ఉప్పు, కాచిన నెయ్యి వేసి అంతా కలుపుకోవాలి.

book7.2.jpgబాదం ముద్దనూ కలపి చపాతీ పిండిలా చేసుకోవాలి. అవసరం అయితే నీటిని, నూనెనూ చేర్చొచ్చు. ఆ తరవాత మూతమూసి అరగంట పక్కనపెట్టాలి. మరో పక్క చక్కెర పాకం తయారుచేసుకోవాలి. ఇందులోనే కుంకుమ పువ్వు రేకులు వేయాలి. బాదం ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని త్రిభుజాకారంలో ఒత్తుకొని నూనెలో కాల్చి, పాకంలో వేసి ఐదు నిమిషాలు ఉంచి తీస్తే బాదం పూరీ రెడీ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0