మీ వెంటే నేను!
కంచికచర్ల రూరల్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ భర్త ఆత్మహత్య చేసుకోవాలని భావించగా, ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు యత్నించి విఫలమైన భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన దొండపాటి సాంబశివరావు (సాంబయ్య) (67), లక్ష్మీదుర్గ (58) దంపతులకు ముగ్గురు సంతానం. సోమవారం రాత్రి 11-12 గంటల ప్రాంతంలో దంపతులు గడ్డి మందు సేవించారు. మంగళవారం ఉదయం ఇంటి తలుపు తెరవకపోవడంతో పనిమనిషి వెనుకవైపు కిటికీ నుంచి చూసేసరికి లోపల ఇద్దరూ పడిపోయి కనిపించారు. ఇరుగుపొరుగు వారు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి సాంబశివరావు అపస్మారక స్ధితిలో, లక్ష్మీదుర్గ కొనఊపిరితో ఉన్నారు. తాము గడ్డిమందు తాగామని ఆమె చెప్పడంతో హుటాహుటిన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే సాంబశివరావు మృతి చెందారు. ఐసీయూలో చికిత్స పొందుతూ లక్ష్మీదుర్గ కూడా బుధవారం మృతి చెందారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0