మామిడి శ్రీఖండ్‌.. చూస్తేనే నోరూరిపోతుంది.

Apr 23, 2026 - 11:54
 0  4
మామిడి శ్రీఖండ్‌.. చూస్తేనే నోరూరిపోతుంది.

కావలసిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు - కప్పు, చిక్కటి పెరుగు - రెండు కప్పులు, చక్కెర పొడి - పావు కప్పు, కుంకుమ పువ్వు పాలు - రెండు స్పూన్లు, యాలకుల పొడి - పావు స్పూను, బాదం పలుకులు - స్పూను, పిస్తా పలుకులు - స్పూను, మామిడి పండు ముక్కలు - కొన్ని.

book10.2.jpgతయారుచేసే విధానం: పెరుగును గిలక్కొట్టాలి. ఆ తరవాత అందులో మామిడి పండు గుజ్జు, చక్కెర, యాలకుల పొడి, కుంకుమ వువ్వు పాలు కలపాలి. చక్కెర కరిగేవరకు బాగా కలిపి ఆ తరవాత బాదం, పిస్తా పలుకులు వేసి కప్పుల్లో వేసి సర్వ్‌ చేస్తే సరి. అయితే పైన మామిడి పళ్ల ముక్కల్ని వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0