బేబీ పొటాటో ఫ్రై.. వింటేనే నోరూరిపోతోందిగా..
కావలసిన పదార్థాలు: బేబీ ఆలుగడ్డలు - పావు కిలో, నువ్వుల నూనె - స్పూను, ఆవాలు - అర స్పూను, జీల కర్ర- అర స్పూను, ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు, కరివే పాకు రెబ్బలు - కొన్ని, ఇంగువ - కాస్త, పసుపు - పావు స్పూను,కారం - పావు స్పూను, సాంబార్ పొడి - స్పూను, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు.
తయారుచేసే విధానం: బేబీ ఆలుగడ్డలను ఉడికించు కోవాలి. ఓ బాణలిలో నూనె వేసి ఆవాలు చిటపటలా డించాలి. జీలకర్ర వేయాలి. ఆ తరవాత ఉల్లి, కరి వేపాకు, ఉప్పు, ఇంగువ వేసి అన్నీ వేయించాలి. బేబీ ఆలూనూ జతచేసి, పసుపు, కారం, సాంబారు పొడినీ కలపాలి. అయిదు నిమిషాలు అన్నింటినీ వేయించి స్టవ్ కట్టేయాలి. పైన కొత్తిమీర తరుగును వేస్తే సరి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0