తిరోగమనంలో పసిడి ధరలు
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో ఈ వారం బంగారం స్పాట్ ధర తిరోగమనంలో పయనిస్తోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, డాలర్ బలపడటం వెరసి బంగారం ధర తగ్గేలా చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు (ఏప్రిల్ 23) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,740గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,41,840ల వద్ద కొనసాగుతోంది. ఈ వారం హైదరాబాద్లో వెండి ధర ఇప్పటివరకూ ఓ మోస్తరు స్థాయిలో మాత్రమే తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,74,900 వద్ద కొనసాగుతోంది.
ఇక చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర గరిష్ఠంగా రూ.1,55,450 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో రూ.1,54,890గా, ముంబై, కోల్కతా నగరాల్లో రూ.1,54,740గా ఉంది. చెన్నైలో ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,42,490గా ఉంది. డిల్లీలో రూ.1,41,990ల వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా నగరాల్లో రూ.1,41,840ల వద్ద తచ్చాడుతోంది. భారత్లో ఈ వారం ఇప్పటివరకూ వెండి స్పాట్ ధర సగటున రూ.10 వేల మేర తగ్గింది. వివిధ నగరాల్లో కిలో వెండి ధర రూ.2.64 లక్షల నుంచి రూ.2.74 లక్షల మధ్య ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0