కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా

Apr 23, 2026 - 11:56
 0  2
కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా

కావలసిన పదార్థాలు: కుట్టు పిండి - రెండు కప్పులు, ఉడికించిన ఆలూ - ఒకటి, పచ్చి మిర్చి ముక్కలు - స్పూను, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, పెరుగు - కప్పు, మిరియాల పొడి - కాస్త, వేయించిన జీలకర్ర - స్పూను, చక్కెర - రెండు స్పూన్లు, దానిమ్మ గింజలు - కొన్ని

తయారుచేసే విధానం: కుట్టు పిండి, ఆలూ, పచ్చి మిర్చి, కొత్తిమీర, ఉప్పు... అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే కాస్త నీటినీ చేర్చుకోవచ్చు. ముద్దలుగా చేసుకుని చిన్న పూరీల్లా వత్తుకుని నూనెలో వేయించాలి. వీటిని చల్లని నీళ్లలో వేసి పక్కనపెట్టాలి. ఓ గిన్నెలో పెరుగు, చక్కెర, మిరియాల పొడి, వేయించిన జీలకర్ర కలిపి గిలక్కొట్టాలి. పూరీలను ఓ ప్లేటులో పెట్టి వాటి పైన ఈ పెరుగు, దానిమ్మగింజలు, కొత్తిమీర వేస్తే కుట్టు దహీభల్లా సిద్ధం. స్నాక్‌గా బాగుంటుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0